ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రాయుడు'గా రానున్న విశాల్

Sat, Apr 16, 2016
విశాల్
విశాల్
యాక్షన్ హీరో గా మంచి మార్కులు కొట్టేసిన కోలీవుడ్ హీరోల్లో విశాల్ ఒకరు. మొదటి నుంచి కూడా ఆయన తన సినిమాలను తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. అలా ఆయన ఇక్కడ కొన్ని హిట్లు సంపాదించుకుని, తెలుగు ప్రేక్షకుల లోను క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలానే ఈసారి ఆయన 'రాయుడు'గా ఇక్కడి ప్రేక్షకులను పలకరించనున్నాడు.

ఈ సినిమా ఫస్టులుక్ ను ఈ రోజున రిలీజ్ చేశారు. ఈ ఫస్టులుక్ పోస్టర్ లో డిఫరెంట్ గెటప్ లో విశాల్ కనిపిస్తున్నాడు. తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాను, హరి వేంకటేశ్వర ఫిలిమ్స్ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత హరి మాట్లాడుతూ, మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, ఆడియన్స్ కి బాగా నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మే మొదటి వారంలో సినిమా షూటింగ్ పూర్తవుతుందనీ .. ఆ వెంటనే ఆడియో వేడుకను నిర్వహించి, 20న సినిమాను విడుదల చేయనున్నామని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)