ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భయపెట్టబోతోన్న రష్మీ గౌతమ్

Sat, Apr 16, 2016
రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్
'శ్రీమంతుడు' సినిమాలో 'చారుశీల' అనే పాట బాగా పాప్యులర్ అయింది. దాంతో జనంలోకి వెంటనే వెళుతుందనే ఉద్దేశంతో 'చారుశీల' అనే టైటిల్ తో ఓ సినిమా రూపొందింది. టైటిల్ రోల్ ను రష్మీ గౌతమ్ పోషించిన ఈ సినిమాకి శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. వీల్ ఛైర్ కి పరిమితమయ్యే ఓ ముఖ్యమైన పాత్రలో రాజీవ్ కనకాల నటించాడు.

ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పిక్స్ ను రిలీజ్ చేశారు. వీటిలో రష్మీ చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. అంతేకాదు కొన్నిచోట్ల భయపెడుతోంది కూడా. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది కనుక, రష్మీ కనువిందు చేయడమే కాదు, దడ పుట్టేలా కూడా చేస్తుందన్న మాట. 'గుంటూరు టాకీస్'లో అందాలవిందు మాత్రమే చేసిన రష్మీ, ఈసారి నటనకి అవకాశం వున్న పాత్రని కూడా చేస్తుండటం ఆసక్తిని కలిగించే అంశం. మరి ఆమె 'చారుశీల'గా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)