ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ కి మోహన్ లాల్ గిఫ్ట్

Fri, Apr 15, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
తెలుగులో అగ్రకథానాయకులలో ఒకరుగా కొనసాగుతోన్న ఎన్టీఆర్ కి, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక సర్ప్రైజ్ గిఫ్టును అందజేశాడు. ఏప్రిల్ 14న మలయాళీల నూతన సంవత్సరాది కావడంతో, ఆ సందర్భంగా కేరళలో మాత్రమే ప్రత్యేకంగా తయారుచేసే ఒక రకమైన స్వీట్ తో పాటు .. ఒక వెండి కృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ కి మోహన్ లాల్ కానుకగా ఇచ్చాడట. 'జనతా గ్యారేజ్' సినిమా వలన ఎన్టీఆర్ తో ఆయనకి ఏర్పడిన అనుబంధమే ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ - సారథీ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ ఐఐటీ స్టూడెంట్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ కొత్తగా .. ఆయన సహజమైన రూపానికి కాస్త దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా ఆకట్టుకోనున్న ఈ సినిమాను, ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)