ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఆక్సిజన్' ఫస్టులుక్ రిలీజ్!

Thu, Apr 14, 2016
గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎమ్.జ్యోతికృష్ణ 'ఆక్సిజన్' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ ను ఈ రోజున రిలీజ్ చేశారు. గోపీచంద్ ఒక నాయకుడిగా ఆయుధాన్ని చేతబట్టి తనవారి ముందు నడుస్తున్నాడు. ఆయన చూపులో ఆవేశం .. ఆయన నడకలో తెగింపు కనిపిస్తున్నాయి. గోపీచంద్ సినిమా నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో, అందుకు సంబంధించిన దృశ్యాన్నే ఫస్టులుక్ గా అందించారు.

ఈ సందర్భంగా నిర్మాత ఐశ్వర్య మాట్లాడుతూ, ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుందని చెప్పారు. రాశీఖన్నా .. అనూ ఇమాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రను పోషిస్తున్నాడని అన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను, సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)