ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మండే ఎండల్లో స్టార్ హీరోలు

Thu, Apr 14, 2016
రజనీకాంత్
రజనీకాంత్
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని సినిమాల షూటింగులు స్టూడియోలకి పరిమితమయ్యాయి. మరికొన్ని సినిమాల షూటింగులు మాత్రం అవుట్ డోర్ లోనే జరుగుతున్నాయి. అలా ఇంతటి ఎండల్లోనే 'రోబో 2.0' అవుట్ డోర్ షూటింగ్ ను జరుపుకుంటోంది. కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది.

ఢిల్లీలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ సినిమా టీమ్ అవుట్ డోర్ లో షూటింగ్ చేస్తోంది. రజనీ .. అక్షయ్ కుమార్ డేట్స్ మళ్లీ దొరికేవి కావు. అందువలన ఈ ఇద్దరిపై యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారట. ఇంతటి ఎండల్లో స్టార్ హీరోలు నటిస్తుండటం విశేషం. అలాగే టీమ్ కూడా చాలా కష్టపడుతోందట. మరో 10 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ అక్కడే జరగనుందని అంటున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేశారు. రజనీ .. శంకర్ కాంబినేషన్ మూవీ కావడం వలన, సహజంగానే భారీ అంచనాలు వున్నాయి. ఇక అక్షయ్ కుమార్ గెటప్ కూడా వెరైటీగా వుండటం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)