ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఘాజీ' గురించి రానా ఇలా చెప్పాడు

Wed, Apr 13, 2016
రానా
రానా
రానా కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'ఘాజీ' సినిమా రూపొందుతోంది. ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే సినిమా కావడంతో, సహజత్వం కోసం కొంతమంది పాకిస్తాన్ రంగస్థల నటులను కూడా తీసుకున్నారట. వాళ్లకి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను గురించి రానా మాట్లాడుతూ .. తెలుగులో మొదటిసారిగా నౌకాదళ యుద్ధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ పాత్రను పోషించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. 'అండర్ వాటర్'కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం, కొన్నిరోజుల పాటు ఉదయం నుంచి రాత్రివరకూ నీళ్లలో గడపవలసి వచ్చిందని చెప్పాడు. భారీస్థాయిలో గ్రాఫిక్స్ .. స్పెషల్ ఎఫెక్టులు ఉంటాయనీ, అవి ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేయడం ఖాయమని అన్నాడు. పీవీపీ బ్యానర్ పై తెలుగు .. హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను, దసరా కానుకగా విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)