ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందుకే ముంబైలో ఇల్లు తీసుకుందట!

Wed, Apr 13, 2016
తాప్సీ
తాప్సీ
ఏ ఊళ్లో అయినా సొంత ఇల్లు వున్నప్పుడే ఆ ఊరు మనది అనే ఫీలింగ్ కలుగుతుంది. సొంత ఇల్లు వున్నప్పుడు ఉండే ధైర్యం వేరు .. కలిగే ఆనందం వేరు. అందుకేనేమో ఇటీవల కథానాయికలు సొంతఇంటి కలను నిజం చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా రాశిఖన్నా హైదరాబాద్ లో సొంతఇంటిని ఏర్పాటు చేసుకుంటే, రకుల్ ప్రీత్ కూడా ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే వుంది.

ఇక తాప్సీకి హిందీలో ఎక్కువగా అవకాశాలు వస్తున్నందు వలన, ముంబైలో ఇంటిని కొనుగోలు చేసింది. ముంబైలోని 'అంధేరీ' ప్రాంతంలో సొంతఇంటిని ఏర్పాటు చేసుకోవడం అంతతేలికైన విషయం కాదని తాప్సీ చెప్పింది. చాలా పెద్దమొత్తంలో ఖర్చుతో కూడుకున్న పని కావడం వల్లనే, చాలా కాలంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చానని అంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు రెండు చేస్తుండటం వలన .. మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉన్నందు వలన ధైర్యం చేశానని చెప్పింది. సొంతఇంట్లో వుండటం వలన ఖర్చు తగ్గడమే కాకుండా, అవకాశాలు పెరిగే ఛాన్స్ కూడా వుందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)