ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

50 లక్షల మంది ఫాలోవర్స్ తో రకుల్!

Mon, Apr 11, 2016
రకుల్
రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ ఆనందంతో పొంగిపోతోంది .. తన ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయినందుకు. ఇటీవల కాలంలో హీరోలు.. హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. అలా వాళ్లు తమ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్నారు. కథానాయికలకి సంబంధించిన ఈ జాబితాలో, కాజల్ . . శ్రుతిహసన్ .. తమన్నా .. త్రిష .. రెజీనా ముందువరుసలో కనిపిస్తున్నారు.

ఆ రూట్లో రకుల్ కూడా తనదైన చురుకుదనాన్ని చూపించింది. దాంతో ఫేస్ బుక్ లో తన పేజీ లైక్ ల సంఖ్య ఈ రోజుతో 50 లక్షల సంఖ్యను దాటేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనని ఫాలో అవుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఫేస్ బుక్ పేజీలో 50లక్షల మంది అభిమానులను పొందినందుకు తనకి చాలా ఆనందంగా వుందని చెప్పింది. అభిమానుల ఆదరాభిమానాలను తాను ఎప్పటికీ మరిచిపోలేననీ, వాళ్లకి నచ్చే పాత్రల్లో మెప్పించడానికిగాను తాను మరింత కష్టపడతానని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)