ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదంతా పుకారేనంటోన్న రాజశేఖర్!

Mon, Apr 11, 2016
రాజశేఖర్
రాజశేఖర్
దర్శకుడు తేజ .. రాజశేఖర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఒక సినిమాపై, కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ వార్త పట్ల రాజశేఖర్ స్పందించడం విశేషం. దర్శకుడు తేజ 'అహం' అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో రాజశేఖర్ విలన్ ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత రాజశేఖర్ షూటింగ్ కి ఆలస్యంగా వస్తున్నాడనీ, అందువలన ఆయనని తేజ తప్పించాడనే ప్రచారం జరిగింది. ఈ పాత్రలో మరో సీనియర్ నటుడుని తీసుకోనున్నట్టు చెప్పుకున్నారు.

అయితే ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని రాజశేఖర్ చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు ఇంకా జరుగుతున్నాయని అన్నారు. షూటింగ్ మొదలైందనీ .. తనని తప్పించారని వస్తోన్న వార్తలు చూసి, తాను .. తేజ చాలా ఆశ్చర్యపోయామని చెప్పారు. ఈ తరహా వార్తలు రాసే ముందు సంబంధిత టీమ్ నుంచి ఒకసారి స్పష్టమైన సమాచారం తీసుకుంటే బావుంటుందనే అభిప్రాయాన్ని రాజశేఖర్ వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)