ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అంతం'లో రష్మీ గౌతమ్ ఫస్టులుక్

Sat, Apr 09, 2016
రష్మీ గౌతమ్ పేరు చెప్పగానే 'గుంటూరు టాకీస్' సినిమాలో ఆమె ఒలకబోసిన అందచందాలు గుర్తుకు వస్తాయి. ఆ సినిమాలో గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన రష్మీ, త్వరలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఆ సినిమా పేరే 'అంతం'. ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తికావడంతో, ఈ రోజున ఫస్టులుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్స్ లో రష్మీ చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఫస్టులుక్ రిలీజ్ సందర్భంగా, ఈ సినిమా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి. కల్యాణ్ మాట్లాడాడు. తాను రామ్ గోపాల్ వర్మ అభిమానిని కావడం వలన, తన మొదటి సినిమాకి ఈ టైటిల్ పెట్టానని అన్నాడు. ఈ కథకి ఈ టైటిల్ బాగా కుదిరిందనీ, ఇంతవరకూ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ రాలేదని చెప్పాడు. రష్మీ .. చరణ్ దీప్ నటించిన ఈ సినిమాకి, కార్తీక్ అందించిన సంగీతం ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అన్నాడు. గ్లామర్ పరంగా .. నటన పరంగా రష్మీ ఆకట్టుకుంటుందనీ, త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)