ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రామ్ సినిమా లాంచ్ రేపే!

Thu, Apr 07, 2016
రామ్
రామ్
తెలుగు తెరపై ఫుల్ జోష్ చూపించే కథానాయకులలో రామ్ ఒకరు. మొదటి నుంచి కూడా ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా ఆయన కొత్తగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ వినిపించిన కథకు ఓకే చెప్పాడు. గతంలో ఆయన శ్రీనివాస్ తో కలిసి 'కందిరీగ' సినిమా చేశాడు. ఈ సినిమా యూత్ ను విపరీతంగా మెప్పించి, సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

దాంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందనే వార్తలు చాలాకాలంగా షికారు చేస్తున్నా, అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. 'ఉగాది' పండుగ సందర్భంగా రేపు ఉదయం 9:15 గంటలకు ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ లోని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారి ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను రేపు తెలియజేయనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'కందిరీగ' వంటి మరో హిట్ మూవీ వస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)