ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఈగ 2'లో సల్మాన్ ఖాన్!

Wed, Apr 06, 2016
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' .. తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనానికి తెర తీసింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే వున్నాయి. అయితే 'బాహుబలి 2' తరువాత రాజమౌళి 'ఈగ 2' చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడనే టాక్ ఈ మధ్య బలంగా వినిపించింది. అది నిజమే కావొచ్చని అనుకోవడానికి, విజయేంద్రప్రసాద్ మాటలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఇటీవల చెన్నై వెళ్లిన విజయేంద్రప్రసాద్ అక్కడ ఒక సందర్భంలో మాట్లాడుతూ, 'ఈగ 2'లో సల్మాన్ ఖాన్ నటించనున్నాడనీ .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని చెప్పాడట. అప్పటి నుంచి ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. రాజమౌళి నుంచి 'ఈగ' సీక్వెల్ రానుందనే విషయం స్పష్టమైపోయింది. 'ఈగ 2'ను తెలుగులో నానితో చేసి .. హిందీలో సల్మాన్ తో చేస్తారా? లేదంటే సల్మాన్ తో మాత్రమే చేస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)