ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కుమారి 21 F' డైరెక్టర్ తో శర్వానంద్

Wed, Apr 06, 2016
శర్వానంద్
శర్వానంద్
యువ కథానాయకులలో శర్వానంద్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ఎన్ని సినిమాలు చేశామనే దానికంటే, ఎలాంటి సినిమాలు చేశామనే దానికే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలా తాజాగా ఆయన దర్శకుడు సూర్యప్రతాప్ కి ఓకే చెప్పాడని అంటున్నారు. సూర్యప్రతాప్ పేరు చెప్పగానే 'కుమారి 21 F' సినిమా గుర్తుకువస్తుంది. ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన ఆయన, యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.

అలాంటి సూర్యప్రతాప్ ఇటీవల శర్వానంద్ ను కలిసి ఒక లైన్ వినిపిస్తే, చాలా బాగుందనీ .. తప్పకుండా చేద్దామని శర్వానంద్ అన్నాడట. పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసి మరోమారు చెప్పమని అన్నాడట. దాంతో సూర్యప్రతాప్ ఆ పనిలో ఉన్నాడని అంటున్నారు. వరుస హిట్లు కొడుతోన్న శర్వానంద్ .. కుమారి 21 F తో యూత్ ను ఒక ఊపు ఊపేసిన సూర్యప్రతాప్ కాంబినేషన్ పై అంచనాలు బాగానే ఉంటాయని చెప్పవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)