ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ బైకును కొనేసిన సుదీప్!

Tue, Apr 05, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
తెలుగు సినిమాల్లో నటించడానికే కాదు .. తెలుగు సినిమాలను కన్నడలో రీమేక్ చేయడానికి కూడా సుదీప్ ఆసక్తిని చూపిస్తుంటాడు. గతంలో 'మిర్చి' .. 'అత్తారింటికి దారేది' వంటి సినిమాలను కన్నడలో రీమేక్ చేసి హిట్ కొట్టిన సుదీప్, ప్రస్తుతం 'గోపాల గోపాల' సినిమాను రీమేక్ చేస్తున్నాడు. 'ముకుందా ముకుందా' అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ పాత్రలో సుదీప్ నటిస్తుండగా, వెంకటేశ్ పాత్రను ఉపేంద్ర పోషిస్తున్నాడు.

'గోపాల గోపాల'లో మోడ్రన్ కృష్ణుడిగా నెమలి పింఛం రంగులోని బైక్ ను పవన్ వాడారు. ఈ సినిమాలో పవన్ ఎక్కువగా ఈ బైక్ పైనే కనిపిస్తారు. ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా కూడా ఈ బైక్ నిలిచింది. అందువలన తన రీమేక్ లోను అదే బైక్ ను వాడాలని భావించిన సుదీప్, 8 లక్షలకు దానిని కొనుగోలు చేశాడు. హైదరాబాద్ నుంచి ఆ బైక్ ను తీసుకెళ్లి, సుదీప్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారని చెబుతున్నారు. పవన్ పట్ల తనకి గల అభిమానం కారణంగాను, అక్కడి ప్రేక్షకుల్లో పవన్ కి గల క్రేజ్ కారణంగాను పవన్ ఉపయోగించిన బైక్ ను ఆయన వాడుతున్నాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)