ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు సినిమాపై దృష్టి పెట్టిన ప్రభుదేవా!

Tue, Apr 05, 2016
ప్రభుదేవా
ప్రభుదేవా
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ప్రభుదేవాకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నృత్య దర్శకుడిగా .. నటుడిగా .. దర్శకుడిగా ఆయన తన సత్తాను చాటుకున్నాడు. అలాంటి ప్రభుదేవా కొంత కాలంగా తన పూర్తి సమయాన్ని బాలీవుడ్ సినిమాలకి కేటాయించాడు. ఇక ఇప్పుడు ఆయన ఒక త్రిభాషా చిత్రంలో నటిస్తున్నాడు.

తమన్నా ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కి 'అభినేత్రి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళ .. హిందీ భాషా ప్రేక్షకులను కూడా ఈ హారర్ మూవీ పలకరించనుంది. ఈ సినిమా తరువాత దర్శకుడిగా ఒక తెలుగు సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ప్రభుదేవా ఉన్నాడని చెబుతున్నారు. తెలుగు తరువాత ఆయన ఒక తమిళ సినిమాను కూడా డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు. ఇటీవల ప్రభుదేవా మాట్లాడుతూ, హారర్ సినిమాను తెరకెక్కించాలనే కోరిక చాలా కాలంగా వుందని చెప్పాడు. దాంతో ఆయన నుంచి ఆ తరహా సినిమా రావొచ్చని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)