ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జగపతిబాబు క్రేజ్ మరింత పెరిగింది!

Mon, Apr 04, 2016
జగపతిబాబు
జగపతిబాబు
తెలుగు తెరపై ఇద్దరు కథానాయికలతో జోడీకడుతూ .. కొంతకాలం పాటు శోభన్ బాబును గుర్తుచేసిన జగపతిబాబు, హఠాత్తుగా విలన్ గా తెరపై ప్రత్యక్షమవుతాడని ఎవరూ ఊహించలేదు. అలా విలన్ పాత్రల వైపు ఆసక్తిచూపిన ఆయనకి విపరీతమైన క్రేజ్ సొంతమైంది. ఇతర భాషలకి చెందిన కథానాయకులు కూడా తమ సినిమాలో విలన్ గా జగపతిబాబు వుండాలని చెబుతున్నారంటే, ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి జగపతిబాబుకి మరో తమిళ చిత్రంలో అవకాశం వచ్చింది. విశాల్ నిర్మిస్తూ హీరోగా చేస్తోన్న 'తుప్పారివాలన్' అనే సినిమా కోసం ఆయనని విలన్ గా ఎంపిక చేసుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ .. మలయాళ సినిమాలతో బిజీగా వున్న జగపతిబాబుకి, ఈ సినిమాలో విలన్ పాత్ర చేయడానికిగాను కోటిన్నర ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన కథానాయికగా రకుల్ నటిస్తుందనే విషయం తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)