ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి' వంటి సినిమా చేస్తాడట!

Mon, Apr 04, 2016
అట్లీ కుమార్
అట్లీ కుమార్
'బాహుబలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇలాంటి సినిమాలో నటించాలని నటీనటులు అనుకున్నట్టే, ఇలాంటి సినిమా చేయాలని ఎంతోమంది దర్శకులు అనుకుంటున్నారు. ఈ తరహా భారీ చిత్రాన్ని తెరకెక్కించి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి తపన పడుతున్నారు. అలాంటి అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తోన్న దర్శకుల జాబితాలో, తాజాగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ చేరిపోయాడు.

ఆయన తాజా చిత్రం 'తెరి' (పోలీసోడు) ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా, ఘన విజయాన్ని సాధించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'రాజా రాణి' తరువాత తనకి తెలుగులో అవకాశాలు వచ్చినా చేయలేకపోయానని అన్నాడు. వివిధ భాషల ప్రేక్షకులు మెచ్చేలా 'బాహుబలి' వంటి సినిమా చేయాలని ఉందనీ, అదే తన డ్రీమ్ అని అన్నాడు. అలాంటి అవకాశం దక్కితే తాను అదృష్టవంతుడి కిందే లెక్క అని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)