ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యంగ్ హీరోకి కలిసొచ్చింది !

Sat, Apr 02, 2016
అడవి శేష్
అడవి శేష్
టైమ్ కలిసి రావాలనే మాట చిత్రపరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తుంది. ఆ టైమ్ కోసమే ఇక్కడ ఎంతో మంది ఎంతో ఓపికతో ఎదురుచూస్తుంటారు. వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతూ, టైమ్ కలిసి రాగానే ముందుకు దూసుకుపోతుంటారు. అలా మంచి అవకాశం కోసం నిరీక్షిస్తూ, ఆయా చిత్రాలలో వివిధ రకాల పాత్రలు చేస్తూ వచ్చాడు అడవి శేష్. 'క్షణం' సినిమాతో ఆయనకి టైమ్ కలిసొచ్చింది.

ఈ సినిమా ఆయనకి అనూహ్యమైన విజయంతో పాటు, మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఆయనకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన అభిషేక్ పిక్చర్స్ వారు, ఆయనతో రెండు సినిమాలు చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారట. మంచి బ్యానర్ కావడంతో అడవి శేష్ వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే పూర్తిచేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)