ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆలోచనలో పడిన దిల్ రాజు!

Sat, Apr 02, 2016
దిల్ రాజు
దిల్ రాజు
ఒక వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మరో వైపున యూత్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు అందించడంలో, దిల్ రాజు ముందువరుసలో కనిపిస్తాడు. సమయం చూసి సినిమాలను విడుదల చేయడంలో ఆయనకి మంచి అనుభవం వుందని అంటూ వుంటారు. అలాంటి దిల్ రాజు .. 'పోలీసోడు' సినిమా విడుదల విషయంలో ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.

తమిళంలో విజయ్ కథానాయకుడిగా 'తెరి' చిత్రం రూపొందింది. ఈ సినిమాను 'పోలీసోడు' పేరుతో తెలుగులో దిల్ రాజు విడుదల చేయనున్నాడు. అయితే తమిళ వెర్షన్ తో పాటు తెలుగులోను ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలనేది విజయ్ అభిప్రాయం. కానీ ఈ సినిమాకి కాస్త ముందుగా అంటే ఏప్రిల్ 8న 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదలవుతోంది. కాస్త వెనకగా ఏప్రిల్ 22న 'సరైనోడు' సినిమా వస్తోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు వున్నాయి. వాటి ధాటికి తట్టుకోవడం కష్టమే కనుక, దిల్ రాజు ఆలోచనలో పడ్డాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)