ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డిఫరెంట్ గెటప్స్ తో కనిపించనున్న శింబు

Sat, Apr 02, 2016
శింబు
శింబు
మొదటి నుంచి కూడా శింబూ మాస్ ఇమేజ్ కి ప్రాధాన్యతనిస్తూ .. వైవిధ్యభరితమైన పాత్రల పట్ల ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రెండు సినిమాలు విడుదలకి రెడీ అవుతున్నాయి. ఇక ఆ తరువాత చిత్రంగా ఆయన చేస్తున్న సినిమా కూడా విభిన్నమైన కథాంశంతోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆయన మూడు డిఫరెంట్ గెటప్స్ తో కనిపించనున్నాడు.

ఇందులో ఒక గెటప్ లో ఆయన 90 కేజీల బరువు కలిగినవాడిలా కనిపిస్తాడట. అందుకోసం ఆయన బరువు పెరగడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఈ గెటప్ కి సంబంధించిన షూటింగ్ పూర్తికాగానే, బాగా సన్నబడినవాడిగా కనిపిస్తాడని చెబుతున్నారు. 'త్రిష ఇల్లన నయనతార' సినిమాతో హిట్ కొట్టిన ఆధిక్ రవిచంద్రన్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)