ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇలియానా పారితోషికం తగ్గించిందట!

Sat, Apr 02, 2016
ఇలియానా
ఇలియానా
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసి, కుర్రకారు కలల రాణిగా వెలుగొందిన కథానాయికలలో ఇలియానా ముందువరుసలో కనిపిస్తుంది. అలాంటి ఇలియానా అవకాశాలను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో, తన పారితోషికాన్ని తగ్గించినట్టు తెలుస్తోంది. ఇలియానా తెలుగులో చాలా వేగంగా అగ్రస్థానాన్ని అందుకుంది. అగ్రకథానాయకులతో జోడీకడుతూ, భారీ విజయాలను దక్కించుకుంది. కోలీవుడ్ ప్రేక్షకుల్లోను ఆమెకి ఎంతో క్రేజ్ వుంది.

అలాంటి పరిస్థితుల్లో ఆమె భారీ ఆశలతో బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ సక్సెస్ ముఖం చాటేయడంతో, అయోమయంలో పడిపోయింది. కాజల్ .. తమన్నాల మాదిరిగా వెంటనే విషయాన్ని గ్రహించి తిరిగి రాకుండా ఆలస్యం చేసింది. ఇక ఇప్పుడు ఆమె తెలుగు .. తమిళ భాషా చిత్రాలపై దృష్టి పెట్టిందట. గతంలో కోటికి పైగా పారితోషికం తీసుకున్న ఆమె, ఇప్పుడు 50 లక్షలు అయినా చేస్తాను అంటూ దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోందని అంటున్నారు. దాంతో కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ రెండు భాషలలోను ఏయే సినిమాల ద్వారా ఈ సుందరి రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)