ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ద్విభాషా చిత్రంలో బ్రహ్మానందం

Fri, Apr 01, 2016
బ్రహ్మానందం
బ్రహ్మానందం
తెలుగు తెరపై హాస్యనటుడిగా బ్రహ్మానందం పూయిస్తోన్న నవ్వుల పువ్వులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి బ్రహ్మానందం ఈ మధ్య కొత్తదనానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది అంటున్నా, ఆయనని వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తూనే వున్నాయి. అలా ఆయన తాజాగా ఒక ద్విభాషా చిత్రంతోను బిజీగా వున్నారు. 'జాగ్వార్' పేరుతో ఈ సినిమా కన్నడ .. తెలుగు భాషల్లో రూపొందుతోంది.

నిఖిల్ గౌడ కథానాయకుడిగా 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయేంద్రప్రసాద్ చేసిన ఒక రచన ఆధారంగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, మహాదేవ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం బ్రహ్మానందం నెల రోజుల పాటు వరుసగా డేట్స్ ఇచ్చారు. సాధారణంగా బ్రహ్మానందం ఒక రోజుకి 5 లక్షల నుంచి 7 లక్షల వరకూ వసూలు చేస్తారనే టాక్ వుంది. ఆ విధంగా చూసుకుంటే 30 రోజులకి కలిపి బ్రహ్మానందానికి పారితోషికంగా భారీ మొత్తమే ముట్టివుంటుందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)