ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్షయ్ ని అభినందించిన రజనీ!

Fri, Apr 01, 2016
రజనీకాంత్
రజనీకాంత్
రజనీకాంత్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎంతోమంది నటీనటులు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆయన అభినందనకి మించిన అవార్డు లేదని అనుకుంటూ వుంటారు. అలాంటి అరుదైన అదృష్టం అక్షయ్ కుమార్ కి దక్కింది. బాలీవుడ్ స్టార్ గా వెలుగొందుతోన్న అక్షయ్ కుమార్, 'రోబో 2.0'లో రజనీని ఎదుర్కునే విలన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను ఇటీవల ఢిల్లీలో చిత్రీకరించారు.

ఆ సందర్భంలో అక్షయ్ కుమార్ ఫెర్ఫార్మెన్స్ ను ప్రత్యక్షంగా చూసిన రజనీ ఎంతగానో మెచ్చుకున్నారట. అంతే, దాంతో అక్షయ్ కుమార్ ఆనందంతో పొంగిపోతున్నాడు. రజనీతో నటించడమే గొప్ప విషయమని అనుకునే తనకి, ఆయన అభినందన లభించడం మరింత విశేషమని సన్నిహితులతో చెబుతూ సంబరపడిపోతున్నాడు. రజనీతో కలిసి ఈ సినిమా చేస్తుంటే, కొత్త ప్రపంచంతో పరిచయం ఏర్పడినట్టుగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడట.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)