ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సక్సెస్ కోసం మంచు బ్రదర్స్ వెయిటింగ్

Thu, Mar 31, 2016
మనోజ్
మనోజ్
ఒక వైపున తనదైన శైలిలో మంచు మనోజ్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మరో వైపున మంచు విష్ణు కూడా తనకి నచ్చిన పాత్రలను పోషిస్తున్నాడు. అయితే ఇద్దరికీ కూడా ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. దాంతో వాళ్లిద్దరూ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 'శౌర్య' పరాజయం తరువాత మనోజ్ 'ఎటాక్' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. తన మార్క్ యాక్షన్ మూవీ కనుక, సక్సెస్ ను ఇవ్వడం ఖాయమనే నమ్మకంతో మనోజ్ వున్నాడు. ఇక 'ఎర్రబస్' .. 'డైనమైట్' సినిమాలు ఆశించినస్థాయిలో ఆడకపోవడంతో, ఇప్పుడు హిట్ అత్యవసరం అన్నట్టుగా విష్ణు వున్నాడు. ఆయన తాజా చిత్రం 'ఈడో రకం ఆడో రకం' ఏప్రిల్ 14న విడుదల కానుంది. కామెడీకి పెద్దపీట వేయడం వలన సక్సెస్ ఖాయమని విష్ణు భావిస్తున్నాడు. ఈ సారైనా మంచు బ్రదర్స్ ను సక్సెస్ పలకరిస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)