ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆర్మీ ఆఫీసర్ గా గోపీచంద్?

Wed, Mar 30, 2016
గోపీచంద్
గోపీచంద్
గోపీచంద్ తాజా చిత్రంగా 'ఆక్సీజన్' రూపొందుతోంది. ఎ.ఎమ్.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. కొంతమంది అవినీతి పరుల నుంచి .. అక్రమార్కుల నుంచి సమాజాన్ని కాపాడే ఆర్మీ ఆఫీసర్ గా ఆయన నటిస్తున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రను పోషించడానికి ఆయన ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడని అంటున్నారు.

ఒక కథానాయికగా రాశీఖన్నా .. మరో కథానాయికగా అనూ ఇమాన్యుయెల్ అలరించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంతకు ముందు చేసిన 'సౌఖ్యం' సినిమా, గోపీచంద్ ను .. ఆయన అభిమానులను కూడా నిరాశ పరిచింది. దాంతో ఈ సినిమాపై ఆయన గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. మరి 'ఆక్సీజన్' తోనైనా ఆయనకి హిట్ పడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)