ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఖరీదైన కారు కొనేసిన అనసూయ!

Wed, Mar 30, 2016
అనసూయ
అనసూయ
బుల్లితెరపై గ్లామర్ తో మెరుస్తూ .. గలగలా మాట్లాడేసే అనసూయ, ఖరీదైన కారు కొనేసిందని తెలుస్తోంది. 'ఆడి క్యూ 7' మోడల్ .. బ్లూ కలర్ లగ్జరీ కారును ఆమె కొనుగోలు చేసిందట. ఇప్పుడు ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు కోటి రూపాయల ఖరీదైన కార్లు స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న పవన్ .. మహేశ్ .. ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ కి, సమంతా వంటి స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే వున్నాయట.

అలాంటిది అనసూయ కూడా ఆ స్థాయి రేటు కలిగిన కారును కొనుగోలు చేయడం గురించి అంతా ఆశ్చర్యపోతూ చెప్పుకుంటున్నారు. పలు టీవీ షోలకు .. సినిమా ఫంక్షన్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ అనసూయ చాలా బిజీగా వుంది. ఇక ఇటీవల తాను చేసిన 'సోగ్గాడే చిన్నినాయన' .. 'క్షణం' సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తన క్రేజ్ .. డిమాండ్ మరింత పెరిగిన నేపథ్యంలోనే, ఆమె ఇంత ఖరీదైన కారును కొనుగోలు చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)