ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇక 150వ సినిమాపై చిరూ ఫోకస్!

Wed, Mar 30, 2016
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి 150వ సినిమా కోసం ఆయన అభిమానులంతా చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటికే ఆయన సినిమా సెట్స్ పైకి వెళ్లి వుండేది కానీ, కూతురు పెళ్లి పనుల కారణంగా ఆలస్యమైంది. శ్రీజ పెళ్లి వేడుకలను ఘనంగా పూర్తిచేసిన చిరంజీవి, ఇక 150వ సినిమాపై ఫోకస్ పెడతానని సన్నిహితులతో అన్నారట.

ఇక ఈ సినిమాలో చిరంజీవి గెడ్డంతో కనిపించే అవకాశం వుందని చెప్పుకుంటున్నారు. 'సర్దార్' ఆడియో వేడుకలో ఆయన గెడ్డంతో కనిపించినప్పుడే, ఫ్యాన్స్ కి సందేహం వచ్చింది. ఇక శ్రీజ పెళ్లి వేడుకల్లోను ఆయన గెడ్డంతోనే కనిపించడంతో, 150వ సినిమాలో ఆయన అలాగే కనిపించనున్నారని అనుకుంటున్నారు. 'కత్తి' రీమేక్ గా రూపొందనున్న ఈ సినిమాకి, వినాయక్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్లో ఈ సినిమాను లాంచ్ చేసి, మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)