ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీతో నారా రోహిత్ సినిమా

Wed, Mar 30, 2016
నారా రోహిత్
నారా రోహిత్
నారా రోహిత్ చాలా నిదానంగా తన కెరియర్ ను ఆరంభించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుని, 'అసుర' సినిమా నుంచి దూకుడు పెంచాడు. ఈ ఏడాది వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలైతే చేసుకుపోతున్నాడు కానీ, తనలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమా ఇంకా పడలేదని ఆయన భావిస్తున్నాడట.

తన లోని హీరోయిజాన్ని ఒక రేంజ్ లో ఆవిష్కరించే దర్శకుడితో ఒక సినిమా చేయవలసిన అవసరాన్ని ఆయన గుర్తించాడని చెబుతున్నారు. అందువల్లనే ఆయన పూరీ జగన్నాథ్ పై దృష్టి పెట్టాడని అంటున్నారు. ఆ దిశగా ఆయన సన్నాహాలు మొదలుపెట్టాడని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పూరీ ఒక కన్నడ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత కల్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయనున్న ఆయన, మరో హీరోకి సంబంధించిన కథా చర్చలను కూడా పూర్తి చేస్తున్నాడట. ఆ తరువాతే పూరీతో నారా రోహిత్ సినిమా ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. మరి ఈ ఏడాది చివరిలోనైనా ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)