ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రుతిహాసన్ కి అలాంటి పాత్రలే కావాలట!

Wed, Mar 30, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
తెలుగు .. తమిళ .. హిందీ ప్రేక్షకుల్లో శ్రుతిహాసన్ కి ఇప్పుడు ఎంతో క్రేజ్ వుంది. కేవలం గ్లామర్ ఒలకబోసే పాత్రలను కాకుండా, నటనకి స్కోప్ వుండే పాత్రలను ఆమె అంగీకరిస్తూ వస్తోంది. 'ప్రేమమ్' సినిమాలో ఆమె లెక్చరర్ గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినప్పుడు, ఆమె సెట్ కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత ఆమె లుక్ బయటికి వచ్చి ఆశ్చర్యపరిచింది.

ఇదే విషయాన్ని గురించి శ్రుతిహాసన్ ప్రస్తావించింది. ఎవరైనా ఫలానా పని చేయలేవని తనని అంటే, దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసే వరకూ తనకి నిద్రపట్టదని చెప్పింది. తన వర్క్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసినవారిని మెప్పించడం కోసం ఎంత కష్టమైనా పడతానని అంది. ఇది తనకి చిన్నప్పటి నుంచి అలవాటని చెప్పింది. 'ప్రేమమ్'లోని లెక్చరర్ పాత్ర కూడా ఒక సవాల్ వంటిదేననీ, అయినా దానిని సమర్థవంతంగా చేశానని అంది. ఈ తరహా ఛాలెంజింగ్ రోల్స్ నే తాను కోరుకుంటూ ఉంటాననీ, అలాంటివి చేసినప్పుడు కలిగే థ్రిల్ వేరని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)