ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

న్యూలుక్ తో కనిపించనున్న రాయ్ లక్ష్మీ

Tue, Mar 29, 2016
రాయ్ లక్ష్మీ
రాయ్ లక్ష్మీ
భారీ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయికగా రాయ్ లక్ష్మీ కనిపిస్తుంది. వెండితెరపై ఆమె చేసే అందాల సందడి గుర్తుకు వస్తుంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఆమెకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి రాయ్ లక్ష్మీ 'జూలీ 2'తో బాలీవుడ్ తెరకి తన సౌందర్యాన్ని పరిచయం చేయడానికి రెడీ అవుతోంది. దీపక్ శివదాసాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో నాజూకుగా .. న్యూ లుక్ తో కనిపించడం కోసం రాయ్ లక్ష్మీ 15 కేజీల బరువు తగ్గింది. ఇంతవరకూ అందాల ఆరబోతతోనే అవకాశాలు కొట్టేస్తూ వచ్చిన రాయ్ లక్ష్మీ, ఈ సినిమాలో గ్లామర్ డోస్ మరింత పెంచినట్టు చెబుతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఆమె స్టిల్స్ కుర్రకారుని హీటెక్కించాయని అంటున్నారు. బికినీతో ఆమె అందాల విందు చేసిందని చెబుతున్నారు. 'జూలీ 2' కోసం కుర్రకారు ఆసక్తిగా ఎదురుచూస్తోందనీ, ఈ సినిమాతో రాయ్ లక్ష్మీ కెరియర్ మలుపు తిరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)