ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Mar 29, 2016
సందీప్ కిషన్, నిత్యా మీనన్
సందీప్ కిషన్, నిత్యా మీనన్
* సందీప్ కిషన్ హీరోగా రాజసింహ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రానికి సంబంధించిన ఒక పాట చిత్రీకరణ ప్రస్తుతం కశ్మీర్ అందాల నడుమ జరుగుతోంది. సందీప్ కిషన్, నిత్యా మీనన్ జంటపై దీనిని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిత్యాతో కలసి అక్కడ తీసుకున్న సెల్ఫీని సందీప్ కిషన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
* త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అ.. ఆ' చిత్రానికి సంబంధించి కథానాయిక సమంతా షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేస్తూ, 'ఈ రోజుతో నా షూటింగ్ పూర్తయింది. ఇందులో అనసూయ రామలింగం పాత్ర పోషిస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది' అంటూ ఈ ముద్దుగుమ్మ పోస్ట్ పెట్టింది.
* వినుభారతి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రాన్ని 'కళావతి' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)