ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సన్నీలియోన్ నిరీక్షణ ఫలించింది!

Sat, Mar 26, 2016
సన్నీలియోన్
సన్నీలియోన్
సన్నీలియోన్ .. పరిచయమే అవసరం లేని పేరు. గ్లామర్ అనే పదానికి అర్థంలా ఆమె కనిపిస్తుందని అభిమానులు చెబుతుంటారు. ఆమె ఒక సినిమాలో నటిస్తోందనే వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి, ఆ సినిమాకి సంబంధించిన ఫస్టు పోస్టర్ నుంచి సినిమా విడుదల వరకూ కుర్రాళ్లంతా ఒకే విధమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటి సన్నీలియోన్, షారుఖ్ ఖాన్ సినిమా 'రయీస్' చేస్తోన్న సంగతి తెలిసిందే.

మొదటి నుంచి కూడా సన్నీలియోన్ బాలీవుడ్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్రకథానాయకుడైన షారుఖ్ తో కలిసి నటించే అవకాశం దక్కుతుందో లేదోననే సందేహం ఆమెను వెంటాడుతూనే వుందట. తన అభిమాన నటుడితో కలిసి నటించే ఆ ఛాన్స్ కోసం ఆమె చాలాకాలంగా ఎదురుచూస్తోంది. అలాంటి ఛాన్స్ ఆమెకి 'రయీస్' ద్వారా లభించింది. ఈ సినిమా షూటింగ్ లో మొదటిరోజున సెట్లో షారుఖ్ ను చూసి, తన కళ్లను తానే నమ్మలేకపోయిందట. తనని తాను గిల్లి చూసుకుని, తన కల నిజమైందంటూ సంతోషంతో పొంగిపోయిందట. తన నిరీక్షణ ఫలించిందంటూ సన్నిహితులతో చెప్పుకుని మురిసిపోతోందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)