ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రైలు ప్రయాణంలో ఈ కథ పుట్టిందట!

Sat, Mar 26, 2016
కీర్తి సురేశ్
కీర్తి సురేశ్
తమిళ తెరపై విభిన్నమైన పాత్రలను పోషించే కథానాయకుడిగా ధనుష్ కనిపిస్తాడు. అలాగే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకునే దర్శకుడిగా ప్రభుసాల్మన్ పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'తొడరి' సినిమా రూపొందుతోంది. 'తొడరి' అంటే 'రైలు' అని అర్థం. నాయకా నాయికలు కలిసి చేసే రైలు ప్రయాణమే ఈ సినిమా కథ అని ప్రభుసాల్మాన్ చెప్పాడు. ఈ కథ తన అనుభవం లోనిదని ఆయన అన్నాడు.

ఒకసారి ఆయన నైవేలి నుంచి ఘజియాబాద్ కి రెండు రోజుల పాటు ప్రయాణం చేశాడట. ఆ సమయంలో తనకి ఎదురైన సంఘటనలు .. పరిచయమైన వ్యక్తులు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారట. ఆ సంఘటనల సమాహారంగానే ఈ కథను రెడీ చేసి తెరకెక్కించడం జరిగిందని ఆయన అన్నాడు. ధనుష్ .. కీర్తి సురేశ్ ట్రైన్ జర్నీగా సాగిపోయే ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)