ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదంతా పుకారేనంటోన్న ఇలియానా

Sat, Mar 26, 2016
ఇలియానా
ఇలియానా
తెలుగు తెరకు నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో ఇలియానా ఒకరు. యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఇలియానా, అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగింది. తమిళంలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసిన ఇలియానా, హిందీ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. బాలీవుడ్లో రాణించడం సంగతి అటుంచితే, తెలుగులో తన స్థానానికి దూరమైంది.

అలాంటి ఇలియానా ఇక సినిమాలకి పూర్తిగా దూరం కానుందనే వార్తలు ఇటీవల షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారం తనవరకూ చేరడంతో ఇలియానా స్పందించింది. తాను సినిమాల నుంచి తప్పుకుంటున్నానని వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది. ప్రస్తుతం తాను అక్షయ్ కుమార్ తో కలిసి 'రుస్తుం' సినిమా చేస్తున్నాననీ, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుందని అంది. తనకి నచ్చిన పాత్రలను చేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)