ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డబ్బింగ్ చెప్పి స్విస్ వెళ్లిన పవన్!

Sat, Mar 26, 2016
'సర్దార్ గబ్బర్ సింగ్'లో పవన్, కాజల్
'సర్దార్ గబ్బర్ సింగ్'లో పవన్, కాజల్
'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. నిన్న పవన్ కల్యాణ్ తన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసి, స్విట్జర్లాండుకి బయలుదేరాడు. యూనిట్ మాత్రం మొన్ననే బయలుదేరి వెళ్లింది. కాగా, నేటి నుంచి అక్కడ పాటల చిత్రీకరణ జరుగుతుంది. పవన్ కాజల్ జంటపై స్విస్ అందాల నేపథ్యంలో రెండు పాటలను చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.
మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడుగా జరిగిపోతున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' సీక్వెల్ కావడంతో ఆ క్రేజ్ తో ఈ చిత్రం 100 కోట్లకు మించిన వ్యాపారాన్ని చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)