ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'వంగవీటి'కి వచ్చిన 'హ్యాపీడేస్' నటుడు!

Fri, Mar 25, 2016
'వంగవీటి' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రామ్ గోపాల్ వర్మ చకచకా సన్నాహాలు చేసేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించి నటీనటులను ఎంపిక చేసి, వాళ్లను పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగే తాజాగా ఆయన ఈ సినిమాకి సంబంధించి 'దేవినేని మురళి' పాత్రను ధరించే నటుడిని పరిచయం చేశాడు.

ఈ పాత్రను పోషించనున్న ఆ కుర్రాడు ఎవరో కాదు, 'హ్యాపీడేస్'లో నిఖిల్ .. వరుణ్ సందేశ్ ల తో పాటు కనిపించిన వంశీ. ఆ సినిమాలో గాళ్ ఫ్రెండ్ ను పూర్తిగా నమ్మేసి, ఆమె చేసే మోసాన్ని చెప్పిన తన ఫ్రెండ్స్ కి దూరమయ్యే పాత్రలో అతను మెప్పించాడు. ఆ వంశీనే చాలాకాలం తరువాత ఈ పాత్రలో కనిపించనున్నాడు. వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అతని ఫోటో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 'హ్యాపీడేస్' సమయంలోని వంశీ ఫోటోను.. 'వంగవీటి'లో వంశీ కనిపించనున్న లుక్ ను ఆయన పక్కపక్కనే పోస్ట్ చేయడం వలన గుర్తుపట్టగలుగుతున్నారు. దేవినేని మురళి పోలికలు అతనిలో తీసుకొచ్చిన వర్మను ప్రశంసిస్తున్నారు. యథార్థ సంఘటనల నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తూ, అందుకు తగిన నటీనటులను ఎంపిక చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా అని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)