ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎమీ జాక్సన్ కి రజనీ కితాబు!

Fri, Mar 25, 2016
ఎమీ జాక్సన్
ఎమీ జాక్సన్
శంకర్ సినిమాలో నటించడానికి మించిన ప్రమోషన్ లేదని హీరోలు, హీరోయిన్లు భావిస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి కనుక, ఆయన సినిమాలలో చేయాలని ఆశపడుతుంటారు. అలా ఎంతోమంది ఆశగా ఎదురుచూసే అవకాశాన్ని 'రోబో 2.0'తో ఎమీ జాక్సన్ అవలీలగా అందుకుంది .. అదీ రజనీకాంత్ సరసన.

ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎమీ పనితీరును చూసిన రజనీకాంత్ ఆమెను ఎంతగానో అభినందించారట. 'రోబో' సినిమా సమయంలో ఐశ్వర్యరాయ్ లోని అంకిత భావాన్ని గమనించాననీ, ఆమె అంత పెద్ద స్టార్ ఎలా అయిందో అప్పుడు తనకి అర్థమైందని రజనీ అన్నారు. అలాంటి అంకితభావమే తనకి ఎమీలోను కనిపిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో ఆమె ఐశ్వర్యరాయ్ స్థాయికి చేరుకునే అవకాశం వుందని ప్రశంసించారు. అభినందించింది రజనీకాంత్ .. పోల్చింది ఐశ్వర్య రాయ్ తో, ఇక ఎమీ సంతోషానికి .. సంబరానికి హద్దులు లేవని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)