ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రోహిత్ ఆశలన్నీ 'సావిత్రి' పైనే!

Fri, Mar 25, 2016
'సావిత్రి' లో ఓ దృశ్యం
'సావిత్రి' లో ఓ దృశ్యం
నారా రోహిత్ కథానాయకుడిగా ఈ ఏడాది ఒకదాని తరువాత ఒకటిగా 9 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ జాబితాలో ఒకటైన 'తుంటరి' సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రోహిత్ తో పాటుగా ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరిచింది. ఆ సినిమా తరువాత ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సావిత్రి' రెడీ అవుతోంది.

నారా రోహిత్ సరసన కథానాయికగా నందిత నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన 'తుంటరి' ఆశించిన ఫలితాన్ని అందివ్వకపోయినా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన 'సావిత్రి' మాత్రం తనకి హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో రోహిత్ ఉన్నాడట. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)