ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అలియా భట్ ఆసక్తిగా ఎదురుచూస్తోందట!

Thu, Mar 24, 2016
అలియా భట్
అలియా భట్
బాలీవుడ్ కుర్ర కథానాయికలలో అలియా భట్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నాజూకు సుందరి సినిమాలు చూడటానికి యూత్ యమ ఉత్సాహం చూపించేస్తూ వుంటుంది. అలాంటి అలియా ప్రస్తుతం ఒక దర్శకుడిని ఒకటే పోగిడేస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు .. 'వేక్ అప్ సిద్' .. 'యే జావనీ హై దివానీ' చిత్రాలను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న ఒక సినిమాలో, కథానాయికగా అలియా భట్ కి అవకాశం దక్కింది. దాంతో అమ్మడి సంతోషం అంతా ఇంతా కాదు.

అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిభావంతుడనీ .. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలే అందుకు నిదర్శనమని ఆమె చెబుతోంది. ఆయన దర్శకత్వంలో నటించనుండటం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అంటోంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనే సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెబుతోంది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)