ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేథరిన్ చాలా ఫీలవుతోందట!

Thu, Mar 24, 2016
కేథరిన్
కేథరిన్
గ్లామర్ విషయంలో ఇప్పుడున్న కథానాయికలలో కేథరిన్ ఎవరికీ తీసిపోదు. అందమైన కళ్లతో ..ఆకర్షణీయమైన రూపంతో ఆమె ఇట్టే ఆకట్టుకుంటుంది. కుర్రకారు ఆమె చక్కదనానికి ఫిదా అయిపోయినా, ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. 'ఇద్దరమ్మాయిలతో' కాస్తంత గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం 'సరైనోడు' సినిమాలో రెండవ కథానాయికగా నటిస్తోంది.

తెలుగులో సరైన గుర్తింపు రాకపోవడంతో కేథరిన్ చాలా ఫీలవుతోందట. కన్నడ .. మలయాళ సినిమాల్లోను మెప్పించిన తనకి, ఇటీవల తమిళం సినిమాల్లోను మంచి క్రేజ్ లభించిందని తాజాగా చెప్పింది. తెలుగులో గ్లామర్ పాత్రలకి మాత్రమే అడుగుతున్నారనీ, అదీ రెండవ కథానాయికగా మాత్రమే అవకాశం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నటనకి అవకాశం వుండే విభిన్నమైన పాత్రలను చేయాలని వుందనీ, తెలుగులో అలాంటి ఛాన్స్ రావడం లేదని వాపోయింది. తన టాలెంట్ ను గుర్తించి మున్ముందు అలాంటి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆమె కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఏమో.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)