ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

12 కోట్లకు 'సర్దార్' హిందీ వెర్షన్ హక్కులు

Thu, Mar 24, 2016
టాలీవుడ్ లో ఇప్పుడు అందరి కళ్లూ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాపైనే వున్నాయి. మొదటి నుంచీ ఈ సినిమాపై ప్రత్యేకమైన ఎటెన్షన్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ సినిమా చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 100 కోట్ల వ్యాపారం చేస్తున్న సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం పవన్ కల్యాణ్ పవర్ ఏమిటో మరోసారి చూపిస్తోంది.

ఈ క్రమంలో ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను 12 కోట్లకు అమ్మినట్టు తాజా సమాచారం. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆ మొత్తానికి హిందీ రైట్స్ ను చేజిక్కించుకున్నట్టు చెబుతున్నారు.
ఒకవిధంగా దీనిని బాలీవుడ్ లో పవన్ కల్యాణ్ స్టామినాగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే తన హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా పవన్ ఉత్తరాదిన కూడా పేరు తెచ్చుకోవడంతో దీనికి ఈ రేటు పలికినట్టు చెబుతున్నారు. ఏప్రిల్ 8న తెలుగు వెర్షన్ తో బాటుగా హిందీ వెర్షన్ ను కూడా ఒకేసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)