ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లారెన్స్ వచ్చేస్తున్నాడు

Wed, Mar 23, 2016
లారెన్స్
లారెన్స్
నృత్య దర్శకుడిగా .. దర్శకుడిగా .. నటుడిగా లారెన్స్ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. త్వరలో ఆయన 'మొట్టశివ కెట్టశివ' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పటాస్' రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. తెలుగులో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది.

కల్యాణ్ రామ్ పాత్రను లారెన్స్ చేయగా .. సాయికుమార్ పాత్రను సత్యరాజ్ పోషించాడు. పాత్రపరంగానే కాకుండా గెటప్స్ విషయంలోను లారెన్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అందువల్లనే ఇటీవల విడుదల చేసిన ఫస్టులుక్ కి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో లారెన్స్ జోడీగా నిక్కీ గల్రాని అలరించనుంది. సాయిరమణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)