ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్లామర్ డోస్ పెంచనున్న కీర్తి సురేశ్

Tue, Mar 22, 2016
కీర్తి సురేశ్
కీర్తి సురేశ్
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో కీర్తి సురేశ్ ఒకరు. 'నేను శైలజ' సినిమాతో యూత్ ను కట్టిపడేసిన ఈ సుందరి, వరుస అవకాశాలతో దూసుకుపోవడం ఖాయమని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. తెలుగులో ఆమె జోరు అంతగా కనిపించకపోవడానికి కారణం, గ్లామర్ డోస్ పెంచడానికి ఆమె ఎంత మాత్రం అంగీకరించకపోవడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల తెలుగులో ఇద్దరు అగ్రకథానాయకుల సరసన నటించే ఛాన్స్ వచ్చినా, ఓ మాదిరిగా అందాలు ఆరబోయడానికి కూడా ఆమె నో చెప్పడంతో, ఆ అవకాశాలు కాస్తా చేజారిపోయాయట. దాంతో గ్లామర్ డోస్ కాస్తంత పెంచకపోతే కష్టమేనని భావించిన కీర్తి సురేశ్, అందాలు ఆరబోస్తూ ఇటీవల ఒక ఫోటో షూట్ చేయించిందట. ఇకపై గ్లామర్ ను కాస్త ఎక్కువగా చూపించడానికి తాను రెడీగా ఉన్నానంటూ, ఇలా ఆమె దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)