ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రోబో 2.0' వచ్చేది ఈ ఏడాదిలోనే!

Tue, Mar 22, 2016
రజనీకాంత్
రజనీకాంత్
రజనీకాంత్ .. శంకర్ ల కాంబినేషన్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న 'రోబో 2.0' సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. అక్షయ్ కుమార్ క్రమశిక్షణ గల నటుడనీ, ఆయనలోని కష్టపడే తత్వం తనకి ఎంతగానో నచ్చిందని దర్శకుడు శంకర్ అన్నాడు.

దర్శకుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని, ఆడియన్స్ ను అలరించే స్థాయిలో దానిని ఆవిష్కరించడం అక్షయ్ కుమార్ ప్రత్యేకతని ఆయన చెప్పాడు. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు తనకి చాలా ఆనందంగా వుందని అన్నాడు. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబర్ నాటికి పూర్తిచేసి, ఈ ఏడాది చివరలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పాడు. తెలుగు .. తమిళ .. హిందీ భాషలలో విడుదల కానున్న ఈ సినిమా కోసం, అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)