ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మూవీని నిత్యామీనన్ చేయనందా?

Mon, Mar 21, 2016
నిత్యామీనన్
నిత్యామీనన్
మహేశ్ మూవీని నిత్యామీనన్ చేయనందట అనేది ఫిల్మ్ నగర్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. మహేశ్ బాబు కథానాయకుడిగా మురుగదాస్ ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం, ఇటీవల నిత్యామీనన్ ను సంప్రదించారట.

తన పాత్ర గురించి విన్న నిత్యా మీనన్, అంతగా ప్రాధాన్యత లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ .. ఆఫర్ ను తిరస్కరించిందని చెబుతున్నారు. ఇది మహేశ్ బాబు సినిమా అని తెలిసి కూడా ఆమె చేయనని చెప్పడం చర్చలకు దారితీసిందని అంటున్నారు. అసలు ఆమె నో చెప్పడం నిజమో .. కాదో తెలియాల్సి వుంది. గతంలో ప్రభాస్ సినిమా విషయంలోను తాను ఒకటంటే .. మరొకటి ప్రచారం చేశారని నిత్యామీనన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)