ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిట్ మూవీ రీమేక్ పై యంగ్ హీరోల దృష్టి!

Sat, Mar 19, 2016
సందీప్ కిషన్
సందీప్ కిషన్
ఇతర భాషలలోని సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడమనేది చాలాకాలం నుంచి ఉన్నదే. అయితే ఇటీవల కాలంలో, రీమేక్ ల జోరు మరింత పెరిగింది. తమిళ సినిమాలపై యువ కథానాయకులు ఒక లుక్కేసి ఉంచారు. అక్కడ ఏదైనా సినిమా హిట్ అనగానే, తెలుగులో దానిని రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. అలా 'సేతుపతి' అనే తమిళ సినిమా రీమేక్ పై ఆసక్తిని చూపుతోన్న యువ కథానాయకుల జాబితాలో సందీప్ కిషన్ కూడా చేరిపోయాడు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించాడు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. క్రితం నెలలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ చిత్రాల కేటగిరిలో చేరిపోయింది. దాంతో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి నాని ఆసక్తిని చూపుతున్నాడు. ఇక సందీప్ కిషన్ కూడా ఈ సినిమా రీమేక్ చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడట. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ సినిమా చేస్తారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)