ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నలభైకి పైగా దేశాలలో 'సర్దార్' సందడి!

Sat, Mar 19, 2016
పవన్ కల్యాణ్ మరో రికార్డుకి రెడీ అవుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదలపరంగా భారీ రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని నలభైకి పైగా దేశాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ తో బాటు పలు ఆఫ్రికన్, యూరోపియన్ దేశాలలో కూడా రిలీజ్ చేయనున్నారు.
ఈ విధంగా మొత్తం 40కి పైగా దేశాలలో ఈ చిత్రం విడుదల అవుతుంది. తెలుగు సినిమాలకు సంబంధించి ఇదొక రికార్డనే చెప్పచ్చు. ఎందుకంటే, ఇంతవరకు ఏ తెలుగు సినిమా కూడా ఇలా 40కి పైగా దేశాలలో రిలీజ్ కాలేదు. ఇప్పటికే బిజినెస్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారిగా కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)