ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మంచు లక్ష్మికి క్లాస్ పీకిన తండ్రి!

Thu, Mar 17, 2016
మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీ
మోహన్ బాబు మాటల్లో 'క్రమశిక్షణ' అనే పదం తప్పనిసరిగా వినిపిస్తుంటుంది. క్రమశిక్షణకి కట్టుబడేవాళ్లను ఆయన ఎంతగానో అభిమానిస్తారు. మోహన్ బాబుకి తగినట్టుగానే ఆయన పిల్లలు నడచుకుంటూ వుంటారు. వాళ్లు చేసిన సినిమాలు ఆయన తప్పకుండా చూస్తుంటారు. పాత్రగానీ .. నటనగాని బాగుంటే ఎంతలా అభినందిస్తారో, తేడావస్తే అంతలా చీవాట్లు పెడతారట. అలా రీసెంట్ గా కూతురు లక్ష్మీ ప్రసన్నకి చీవాట్లు పడ్డాయని అంటున్నారు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'గుంటూర్ టాకీస్' సినిమాను తెరకెక్కించాడు. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది కూడా. ఈ సినిమాలో హీరో దగ్గర డబ్బులు కొట్టేసే గెస్టు రోల్ ను లక్ష్మీ చేసింది. ఈ సినిమా మోహన్ బాబుకి ఎంతమాత్రం నచ్చలేదట. అలాంటి ఈ సినిమాలో లక్ష్మీ చేసిన పాత్ర కూడా ఆయనకి కోపాన్ని తెప్పించిందని చెబుతున్నారు. దాంతో ఆమెను పిలిచి ఇలాంటి పాత్రలనా ఎంపిక చేసుకునేది? అంటూ చీవాట్లు పెట్టారట. ఇకపై ఈ తరహా సినిమాల్లో ఇలాంటి పాత్రలను చేయనని ఆమె వివరణ ఇచ్చుకుందని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)