ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిట్ ఇచ్చిన వాళ్లకే ఛాన్స్ ఇచ్చిన హీరో!

Wed, Mar 16, 2016
నిఖిల్
నిఖిల్
'శంకరాభరణం' సినిమా తననీ .. అభిమానులను నిరాశపరచడంతో, నిఖిల్ వెంటనే జాగ్రత్త పడిపోయాడు. దర్శకుడు ఆనంద్ తో ఒక సినిమా చేస్తోన్న ఆయన, ఆ కథ విషయంలోను మరింత శ్రద్ధ పెట్టాడు. అంతేకాదు .. ఈ సమయంలో కొత్త దర్శకులకి ఓకే చెప్పడం కన్నా, తనకి హిట్ ఇచ్చిన వాళ్లకి ఛాన్స్ ఇవ్వడమే బెటర్ అని భావించాడు. అందుకే 'స్వామిరారా' తో తనకి సూపర్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

అంతేకాదు 'కార్తికేయ'తో తనకి మరింత క్రేజ్ తెచ్చిన చందూ మొండేటి కథకి కూడా ఓకే చెప్పేశాడు. ఈ రెండు సినిమాలను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆనంద్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా, వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతున్నదేనట. ఈ కంటెంట్ పై నమ్మకంతోనే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా హక్కులను అభిషేక్ పిక్చర్స్ వారు దక్కించుకున్నారని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)