ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యాక్షన్ మూవీలో అనసూయ?

Tue, Mar 15, 2016
అనసూయ
అనసూయ
బుల్లితెరపై యాంకర్ గా ఎక్కువ మార్కులు కొట్టేసిన అనసూయ, వెండితెరపై కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. 'సోగ్గాడే చిన్నినాయన'లోను .. 'క్షణం' సినిమాలోను ఆమె పోషించిన పాత్రలకి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయా పాత్రలకి గాను అనసూయను సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఆమె మాత్రం గ్లామర్ తో పాటుగా నటనకి అవకాశం వుండే పాత్రలకి ఓకే చెబుతూ వెళుతోంది.

ఈ నేపథ్యంలో ఆమె ఒక యాక్షన్ మూవీలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. పీవీపీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఇప్పటికే కథ రెడీ అయిందనీ .. దర్శకుడు కూడా ఓకే కావడం జరిగిపోయిందని చెబుతున్నారు. ఈ సినిమాలో అనసూయ పోషించే పాత్ర ఏమిటో తెలియదు గానీ, పారితోషికం మాత్రం భారీగానే అడిగిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)